Monday, December 23, 2024

కాంగ్రెస్ కు గతమే తప్ప.. భవిష్యత్తు లేదు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి గతమే తప్ప.. భవిష్యత్తు లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఅర్ఎస్ పార్టీలో చేరారు. హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో మీరంతా చూశారని.. కాంగ్రెస్ కు గతమే తప్ప, భవిష్యత్తు లేదని విమర్శించారు.

గజ్వేల్ లో కాంగ్రెస్ కు ఈసారి డిపాజిట్ కూడా రాదని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప.. ప్రజల బాధలు వారికి పట్టవని అన్నారు. బిజెపికి బలం లేదు, కాంగ్రెస్ కు కాండిడేట్లు లేరు.. బిఅర్ఎస్ కు తిరుగు లేదని ఆయన పేర్కొన్నారు. ఎవ్వరు ఔనన్న, కాదన్నా బిఅర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం, కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News