Wednesday, December 25, 2024

గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా..?: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సిఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా గురుకుల అభ్యర్థుల మొర ఆలకించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు గాను

బిఆర్‌ఎస్ ప్రభుత్వం 9,210 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు వివరించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్‌లాగ్ అవ్వకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News