Friday, December 27, 2024

దమ్ముంటే రాజీనామా చెయ్.. నగరంలో హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రైతు రుణమాఫీ ఫైనల్ ఫేజ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వేళ ఎమ్మెల్యే హరీశ్ రావు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గడువులోపే రుణమాఫీ చేశామని, చీము, నెత్తురు ఉంటే హరీశ్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

కాగా సీఎం మాట్లాడిన తర్వాత రాత్రికి రాత్రే నగరంలో మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే..నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీ లను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా సీఎం సవాల్‌పై స్పందించిన బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు రుణమాఫీ సక్రమంగా చేయలేదని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News