Friday, March 21, 2025

ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీశ్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యా పింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావుకు ఊరట లభించింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావుపై పంజా గుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశా రు. దర్యాప్తులో భాగంగా హరీశ్‌రావును అరెస్టు చేయవద్దంటూ గతంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ పిటిషన్‌పై ఇరు వైపుల వాదనలు ముగియడంతో హరీశ్‌రావుపై దాఖలైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News