ఫోన్ టాపింగ్ కేసు లో మాజీ మంత్రి హరీష్ రావు భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు హరీష్ రావును ఈ కేసులో అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వుల ను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హరీష్ రావును అరెస్ట్ చేయవద్దని పంజాగుట్ట పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను మార్చి 3కు వాయిదా వేస్తున్నట్లు హైకో ర్టు వెల్లడించింది.
కాగా గతంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కాంగ్రెస్ నేత జి.చక్రధర్‌గౌడ్ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఇంటెలి జెన్స్ విభాగం సహకారంతో ట్యాప్ చేశారని, దీని వెనుక బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీష్‌రావు హస్తం ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశా రు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఎ1గా హరీష్ రావు, ఎ2గా టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావును పేర్కొ న్నారు.