Wednesday, January 22, 2025

లాస్య నందిత అంతిమయాత్రలో పాడె మోసిన హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

లాస్య నందిత మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన హరీశ్‌రావు
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు …

మనతెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ లాస్య నందిత మరణవార్త తెలియగానే మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు హుటాహుటిన పటాన్‌చెరు అమేధా ఆసుపత్రికి చేరుకుని, అక్కడి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. పోస్టుమార్టం కోసం లాస్య నందిత మృతదేహాన్ని అమేధా ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. భౌతికకాయం వెంట గాంధీ ఆస్పత్రికి ఎంఎల్‌ఎగా హరీశ్‌రావు వెళ్లారు.

గాంధీ ఆసుపత్రికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, లక్ష్మా రెడ్డి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో నందిత మృతదేహానికి శవపరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కార్ఖానాలో లాస్య నందిత నివాసానికి మృతదేహాన్ని తరలించారు. శుక్రవారం సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య లాస్య నందిత నిర్వహించారు. అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాస్య నందిత పాడెను మోశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News