ములుగు: మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనార్థం గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ వేసుకున్నారా.. అంటూ ఆరా తీశారు. తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ప్రజానీకానికై ఏంపీటీసీ బాల్ రెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమైనవని, గ్రామంపై బాల్ రెడ్డికి ఉన్న మమకారం ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి కొనియాడారు.
Harish Rao Inaugurate Free Mineral Water Plant