Saturday, November 16, 2024

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలో ఎల్ వి ప్రసాద్ నేత్ర(కంటి) ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించి.. మొబైల్ కేంద్రం ద్వారా సిద్దిపేట కంటి ఆసుపత్రి వైద్యులు, పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ”తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 1 కోటి 30 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక టెక్నాలజీతో ఐ డయాగ్నాస్టిక్ మొబైల్ వాహనాన్ని సత్యసాయి సేవ సమితి వారు ఇవ్వడం సంతోషాన్ని కలిగించింది. నూతనంగా ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం వలన రాజేంద్రనగర్ ప్రజలకు నగరానికి వెళ్లే పరిస్థితి తప్పింది. త్వరలోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు” అని అన్నారు.

Harish Rao inaugurate LV Prasad Eye Hospital in Kismatpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News