Friday, November 22, 2024

మొక్కలు పెంచండి

- Advertisement -
- Advertisement -

మొక్కలు పెంచండి.. ప్రకృతి ఒడిలో పరవశించండి

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచాలి
ప్రకృతిని ప్రేమించడమంటే సామాజాన్ని ప్రేమించడమే
పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తే ఆక్సిజన్ సీసాలు కొనుక్కోవలసి వస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం అడవులను పునరుద్ధరిస్తోంది,
దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణాల్లో, గ్రామాల్లో నర్సరీలు పెంచుతోంది : జాతీయ ఉద్యాన ప్రదర్శనను ప్రారంభిస్తూ మంత్రి హరీష్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని రాష్ట్ర అర్ధికశాఖ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. గురువారం నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యాన ప్రదర్శనకు మంత్రి ప్రారంబోత్సవం చేశారు. వివిధ రకాల పూల మొక్కలు, పండ్లమొక్కలు, మరుగుజ్జు వృక్షాల స్టాల్స్‌ను సందర్శించి మొక్కల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు.ప్రకృతిని ప్రేమించడమంటే సమాజాన్ని ప్రేమించటమేనని స్పష్టం చేశారు. మొక్కలు పెంచితే భావితరాలకు మంచి భవిష్యత్తును అందిగలమన్నారు. మొక్కల పెంపకం వల్ల నగర వాసులు మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. పరిశుభ్రమైన నీటికోసం ఇప్పటికే వాటర్ బాటిల్స్ కొనే పరిస్థితి వచ్చిందని, ఇక పర్యావరణం పట్ల అశ్రద్ధ చేస్తే ఆక్సిజన్ బాటిల్స్ కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం అడవుల పునరుద్దరణతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలు పెంచుతోందన్నారు. స్ధానిక సంస్థల బడ్జెట్‌లో పదిశాతం నిధులు మొక్కల పెంపకానికే ఖర్చు చేయాలని చట్టం తెచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో 2015నుంచి జాతీయ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి ఒకటి వరకూ ప్రతిరోజు రాత్రి 9గంగల వరకూ ఉద్యాన ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనలో పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కల కొనుగోలుకు నగర వాసులు ఈ ప్రదర్శనను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన
వివిధ రకాల పూలు పండ్ల మొక్కలతో జాతీయ ఉద్యాన ప్రదర్శన ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో డార్జిలింగ్, కొల్కత్తా ఢిల్లీ, హర్యానా, ముంబాయి, బెంగుళూరు, పూణె, షిర్డీ, కడియం, చెన్నై, తదితర ప్రాంతాలనుంచి వచ్చిన నిర్వాహకులు 130స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో రోబోటిక్ వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్ వంటి నూతన టెక్నాలజీలను ప్రదర్శనలో ఉంచారు. పదిరూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ వివిధ రకాల మొక్కలు విక్రయానికి ఉంచినట్టు మేళా ఇంచార్జ్ ఖలీద్ ఆహ్మద్ పేర్కొన్నారు.

Harish Rao inaugurate National Park Exhibition at Necklace road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News