Saturday, December 28, 2024

డయాలసిస్ సేవల్లో తెలంగాణ ఛాంపియన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్లు పూర్తి చేశామని చెప్పారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా.. శుద్ధి చేసిన ఉపరితల తాగు నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలంగాణ మోడల్ అనుసరిస్తున్నామని చెప్పారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో విభాగంలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను శనివారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,డయాలసిస్ రోగులకు సేవలందించే విషయంలో రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు.

దేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గతంలో ఇది కార్పొరేట్ హాస్పిటళ్లకే పరిమితమైందని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజలకు సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టం ద్వారా డయాలసిస్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు పది వేల మందికి డయాలసిస్ చేస్తున్నామని వెల్లడించారు. డయాలసిస్ చేయించుకునేవారికి బస్‌పాస్, పెన్షన్లు, ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు. డయాలసిస్‌పై ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు ఉంటే వాటిని 102కి పెంచుతున్నామన్నారు. జీవన్‌దాన్‌లో అవయవాల కోసం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉందని, అందరం కలిసి అవయవదానాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం
పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏటా ఆరోగ్య శ్రీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఐసియూ పడకలు రెట్టింపు చేసుకున్నామని అన్నారు. శుద్ధిచేసిన తాగునీరు అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రాథమిక దశలోనే గుర్తించి రోగాలు రాకుండా చూసుకోవాలన్నారు. కిడ్నీట్రాన్స్‌ప్లాంటేషన్లు అత్యధికంగా నిమ్స్‌లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. దవాఖానలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది ఓనర్‌షిప్‌తో పనిచేయాలని, పేదలకు మంచి వైద్యం అందించాలని సూచించారు. ప్రజల్లో ఎక్కువగా బిపి, షుగర్‌లు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడంతో పాటు వ్యాధులు రాకుండా అవసరమైన చర్యలు చేపడుత్నుమని తెలిపారు.

ఎన్‌సిడి స్క్రీనింగ్ చేసి, వ్యాదులు ఉన్న వారికి మందులు ఇస్తున్నామని వివరించారు. పెద్ద వారికి అర్ధం అయ్యేలా వివిధ రంగులలో మూడు పౌచుల్లో మందులు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో అరోగ్య శ్రీలో కింద పేదలకు అత్యున్నత వైద్యం అందుతున్నదని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారని, నిఫ్రాలజీ విభాగం పనితీరు అద్బుతంగా ఉందని కొనియాడారు. మాట్లాడుతూ.. వైద్యులు నిత్య విద్యార్థులేనని, కొత్తగా వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వాస్క్యులర్ సర్జరీ సింపోజియం నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు దామోదర్ రెడ్డి, వైద్యులు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News