హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరర పలు వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ”గాంధీ ఆస్పత్రి చాలా ప్రెస్టేజియస్ హస్పిటల్. కోవిడ్ సమయంలోనూ వైద్యాధికారులు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్, నర్సులు చాలా అద్భుతంగా సేవలు అందించారు. అందరూ కష్టపడి పనిచేశారు. మొత్తం 84,187మంది కరోనా రోగులకు వైద్యం అందించిన ఘనత గాంధీ ఆస్పత్రి సిబ్బందికే దక్కుతుంది.కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆస్పత్రి సిబ్బంది అద్భుతంగా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ గాంధీ ఆస్పత్రికి రూ.176కోట్లు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.100కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.76కోట్ల పనులు జరగవల్సి ఉంది. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన గాంధీ ఆస్పత్రిలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల వైద్యం అందేవిధంగా రాబోయే రోజుల్లో మరింత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అత్యాధునిక పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించాం. త్వరలోనే మరో 45 రోజుల్లో ఎంఆర్ఐని క్యాథ్ ల్యాబ్ ను గాంధీలో అపరేషనలైజ్ చేస్తాం” అని మంత్రి పేర్కొన్నారు.
Harish Rao inaugurates City Scan Centre in Gandhi Hospital