Wednesday, January 22, 2025

అవార్డులు ఇస్తారు కానీ నయా పైసా ఇవ్వరు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: భవిష్యత్ 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం నాలుగు జిల్లాలకు తాగు నిరందించే ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా మంగోల్ లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులు పరుశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ స్మిత సబర్వాల్, కలెక్టర్ ప్రాశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..”మిషన్ భగీరథ చరిత్రలో సుస్థిరమయిన రోజు.. దేశంలోనే ప్రతిరోజు 540 ఎమ్ఎల్ డి సామర్థ్యంతో నీటి విడుదల జరుగుతోంది. లేటెస్ట్ టెక్నాలజి, ఈక్విప్ మెంట్ వాడాము. ఈ రోజు 50 శాతాన్ని ట్రయల్ రన్ చేపట్టాము. ఈ పథకం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాము. ప్రపంచంలోనే మానవులు నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. ఏడు జిల్లాలు, 10 నియోజకవర్గాలోని 1922 గ్రామాలకు నీటి సరఫరా అవుతుంది. హైదరాబాద్ కు మేలు జరగబోతుంది. ఇప్పటి వరకు 300 మిలియన్ లిటర్లు సరఫరా అవుతుండగా, ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు అవకాశం ఏర్పడింది.

భవిష్యత్ లో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు. ఈ ఏడు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అవుతుంది. భవిష్యత్ 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించాము. జూన్ నెలలో పూర్తి కావాల్సిన ఈ పథకాన్ని రెండు నెలలు ముందుగానే పూర్తి చేశాం. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సహకారాన్ని అందించనది మేము కాదు కేంద్రమే. మిషన్ భగుర్తకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా 13 పైసలు ఇవ్వలేదు. గుజరాత్, గోవా రాష్ట్రాలకు ఇస్తారు.. తెలంగాణకు ఇవ్వరేట్ల. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది వాస్తవం కాదా?.

మిషన్ భగీరథ వంటి ఉత్తమమైన కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణకు ఇంసెంటివ్ లు ఇవ్వకుండా పక్షపాతం చూపడం లేదా?. తియ్యటి మాటలు చెబుతరు, అవార్డులు ఇస్తారు కానీ నయా పైసా ఇవ్వరు. ఈ స్కింను గజ్వెల్ లో ప్రారంభించి, అభినందించింది ప్రధాని మోడీ కాదా?. మిషన్ భగీరథ వల్ల ఆదిలాబాద్, అసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతాల్లో వాటర్ డీసీజ్ లు మాయం అయ్యాయి. ప్రజల జీవన ప్రామానం పెరిగింది. ప్రభుత్వానికి ఈ పథకం వల్ల ఆదా పెరిగింది.. ఖర్చు మిగిలింది, ప్రజల కష్టాలు తీరాయి. కొంత మంది మూర్కులు మిషన్ భగీరథ వల్ల డబ్బులు వృధా అని మాట్లాడారు.. వృధా కాదు ఆదా అయ్యాయి” అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News