Wednesday, January 22, 2025

పాకో యంత్రాలతో ఇన్ఫెక్షన్ ఉండదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో ఫ్యాకో యంత్రాలు సరోజిని దేవి ఆస్పత్రిలో మాత్రమే ఉండేవని ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఫ్యాకో యంత్రాలు ప్రారంభించుకున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో ఫ్యాకో యంత్రాలను మంత్రి హరీష్ రావు, మహమూద్ అలీ ప్రారంభించారు.  తెలంగాణ వ్యాప్తంగా వర్సువల్ విధానంలో యంత్రాలను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సరోజినిదేవి ఆస్పత్రిలో రెండు ఫ్యాకో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రెండోవ ఫేజ్ కంటి వెలుగులో 40 లక్షల మంది అద్దాలు ఇచ్చామన్నారు. ఫ్యాకో యంత్రాలతో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. త్వరలోనే సరోజిని ఆస్పత్రిలో న్యూబ్లాక్ నిర్మాణం జరుగుతోందని హరీష్ రావు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News