Friday, November 8, 2024

గిట్టుబాటు గిరాకీ అయితుందా..!: రైతులతో ముచ్చటించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: మీకు అనుకున్న గిరాకీ గిట్టుబాటు అవుతుందా.?, రైతుబజారులో సౌలత్ లు ఏట్లా ఉన్నాయి, ఇంకేమైనా కావాల్నా.. అంటూ రైతులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ముచ్చటించారు. నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతు బజారును పరిశుభ్రంగా నిలపాలని, పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతూ ఇట్లా అయితే ఏలా అంటూ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం పట్టణంలోని రైతుబజారును ఆకస్మికంగా సందర్శిస్తూ.. ఫ్లోర్ కలియ తిరుగుతూ విక్రయ దారులైన రైతులతో మాటామంతి కలిపారు. ములక్కాయలు విక్రయిస్తున్న ఓ మహిళా రైతుతో ముచ్చటిస్తూ.. గిట్టుబాటు అవుతుందా.. అంటూ ఆరా తీశారు. కిలో 50 రూపాయలు ధర పలుకుతున్నదని రైతు వివరించింది. పది ఎకరాల్లో వస్తుందని, ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని సంబురంగా చెప్పింది. నేను ఐదేకరాలు ములక్కాయ పంట పెడతానని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు, కారం, పసుపు విక్రయ కేంద్ర నిర్వాహకులు లక్ష్మీతో మంత్రి ముచ్చటించారు. వ్యాపారం ఏలా కొనసాగుతున్నదని ఆరా తీశారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు హైదరాబాదు మార్కెట్లో సైతం ఎగుమతి చేయాలని, ఇందుకు పోలీసు కమిషనర్ శ్వేత కావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డికి సూచించారు.

Also Read: తెలంగాణకు జెపి నడ్డా.. నాగర్ కర్నూల్ లో బిజెపి భారీ బహిరంగ సభ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News