Sunday, December 22, 2024

హరీశ్  రావు ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటు వేసిన యువత ఒక్కసారి పునరాలోచించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. గ్యారంటీలను పూర్తిగా అమలుచేయకపోగా, అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛను కూడా పెంచలేదని, రుణమాఫీ చేయలేదని, రైతుబంధును నిలిపేశారని, రైతు భరోసాకు దిక్కులేకుండా పోయిందని, బోనస్ ను బోగస్ చేశారని పేర్కొన్నారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్నారు…పది నెలలు గడిచినా అతీ గతీ లేదు. నాలుగు వేల రూపాయాల నిరుద్యోగ భృతికి నీళ్లొదిలారన్నారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించడని హరీశ్ రావు కోరారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బిసి డిక్లరేషన్ లపై ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News