Sunday, December 22, 2024

గం 10.30 అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉదయం 10.30 గంటల తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల బడ్జెట్ కావడంతో సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి బయల్దేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News