Sunday, January 19, 2025

అమ్ముడుపోయిన ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదు: కూనంనేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత పదేళ్లు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కూనంనేని సాంబశివరావు అన్నారు. పదేళ్లలో కొనుగోళ్లు, అమ్మకాలు చాలా చూశామన్నారు. అమ్ముడుపోయిన వాళ్లు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు. పదేళ్లలో ఎంతమంది హౌస్‌ అరెస్ట్ అయ్యారో లెక్కలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలును బిఆర్‌ఎస్‌ చేసి తప్పు చేసిందన్న కూనంనేని నెగిటివ్‌ వచ్చి స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. బిఆర్‌ఎస్‌ హామీలు చేయలేదంటే హరీశ్‌రావుకు కోపం వస్తుందన్న ఆయన 3 ఎకరాల భూమి ఇచ్చారా, ఇళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. సదుద్దేశంతో చెబితే హరీశ్‌రావు వినడం లేదని కూనంనేని సాంబశివరావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News