Wednesday, January 22, 2025

మన చెత్త.. మన బాధ్యత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్ : నడకతో మంచి ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేయవచ్చునంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ వార్డు వెంకటేశ్వర కళా మందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త, మన బాధ్యత అంటూ గృహిణులకు చెత్త పేరుకపోతే కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో పేరుకపోయిన ప్లాస్టిక్ కవర్లు, చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ పేపర్లు, వాటర్ గ్లాసులు,

చాయ్ గ్లాసులు, శానిటరి వేస్ట్ చెత్తను స్వయంగా ఎత్తి సంచిలో వేశా రు. పట్టణాలలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దని వీటి ద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రజలలో మార్పు వస్తే గ్రామాలలో కూడా మార్పు వస్తుందన్నారు. ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో మురుగు నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలంలో దోమల లార్వా అభివృద్ధి చెందుతుందని, తద్వారా డెంగీ, మలేరియా తదితర వ్యాధులు వ్యాప్తి చెం ది ఇబ్బందులకు గురికావల్సి వస్తుందన్నారు. పరిశుభ్రత పాటిస్తే మంచి కుటుంబంతో మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్తే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మరీ ముఖ్యం గా పిల్లల తల్లిదండ్రులను జాగ్రత్తలు పాటించాలని హరీశ్‌రావు సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కడవేర్గు రాజనర్సు, జంగిటి కనకరాజు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్‌రెడ్డి, మోయిజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News