Wednesday, December 18, 2024

కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెరుగైన వైద్యం ప్రజలకు అందించడం కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక ఛాలెంజ్ అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం నగరంలో హై టెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రూ బీమ్ రేడియేషన్ మెషిన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ”హై టెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో ట్రు బీమ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. కేన్సర్ అనేది చికిత్స ద్వారా తగ్గించే వ్యాధి.  ఎక్కువగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని కోరుతున్నా. చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుంది. పేదలకు వైద్యం అందించాలి. పేద వారి కోసం మనం ఆలోచన చేయాలి. రూ.11,440 కోట్లను ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 8 మెడికల్ కాలేజీలు ఒకే రోజున(ఈనెల 15న) ప్రారంభించుకోబోతున్నం. అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో క్యాథ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసుకున్నాం. మహబూబ్ నగర్, సిద్దిపేట లో త్వరలో క్యాథ్ ల్యాబ్స్ ప్రారంభం కానున్నాయి. జిల్లాల్లో మోకీలు మార్పిడి సర్జరీలు చేసుకుంటున్నాం. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతుంది. మానవత్వంతో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా” అని అన్నారు.

Harish Rao launches Truebeam in Medicover Cancer Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News