Monday, December 23, 2024

వైద్యంలో ప్రభుత్వం సూపర్ హిట్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు కాదు ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో పలు అభివృధి కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితోపాటు హరీశ్ రావు పాల్గొన్నారు. జాల్ పల్లీ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 12 కమ్యూనిటీ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “శ్రీ రాంనగర్ కాలనీ అంటే మినీ ఇండియాగా గుర్తింపు పొందింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలను గౌరవిస్తూ ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. మీరు మీ సొంత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని, అభివృద్ధిని పోల్చి చూడవచ్చు. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో వారానికి ఒకరోజు కూడా మంచినీళ్లు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లలు పెట్టి మంచినీళ్లు అందిస్తున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కల్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ పథకం ఉందా. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నంత ఆసరా పెన్షన్ లేదు. రైతుబంధు లేదు. రైతు బీమా లేదు. కల్యాణ లక్ష్మి లేదు. షాదీ ముబారక్ లేదు. కేసిఆర్ కిట్టు లేదు. కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు కాదు ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలి.

సీనియర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారు. కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్న నాయకులు రేపు తెలంగాణను కూడా అమ్ముతారు. తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తలసరి ఆదాయం పెరిగింది. విద్యుత్ వినియోగం పెరిగింది. వైద్య విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు వారి ప్రభుత్వాలు నిలదీస్తున్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు.. తెలంగాణకి ఏం చేశారని వస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది బిజెపి పార్టీ. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి రాష్ట్ర అభివృద్ధిని ఆడ్డుకుంటోంది. ఎవరైతే మీకోసం పనిచేస్తున్నారో వారికే ఓటు వేసి గెలిపించాలి. త్వరలో శ్రీరామ్ నగర్ లో యూపీహెచ్సీ నిర్మాణం, అదే విధంగా జల్ పల్లీ మున్సిపాలిటీకి 30 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తా. వైద్యంలో ప్రభుత్వం సూపర్ హిట్. పల్లె దవాఖనలు, బస్తీ దవాఖానలు, మెడికల్ కాలేజ్ లు , హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఇలా పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా వైద్య సౌకర్యాలు కూడా పెంచుకున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News