Monday, December 23, 2024

కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి హరీశ్ రావు లేఖ..

- Advertisement -
- Advertisement -

Covid vaccination 5 crore

హైదరాబాద్: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. లేఖలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీపై మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. ”రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలి. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. అ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం” అని లేఖలో పేర్కొన్నారు.

Harish Rao letter to Union Health Minister

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News