Monday, December 23, 2024

హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందొచ్చు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి చంద్ర ఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగగలదని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్ధమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామన్నారు. ఆ తర్వాత భారీ నీటి పారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. జులై రెండో వారం లేకుంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి అయిన హరీశ్ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News