Tuesday, December 3, 2024

నరేందర్‌రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ప్రభుత్వంపై హరీశ్ రావు మండిపడ్డారు. లగచర్ల ఘటనలో అరెస్టైన నరేందర్‌రెడ్డిని గురువారం హరీష్‌రావు జైలుకెళ్లి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర సర్కార్ పై విమర్శలు చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోందని.. ప్రజల తిరుగుబాటును ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారని.. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్‌ కుట్ర ఉందంటున్నారని దయ్యబట్టారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా..ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News