Tuesday, December 24, 2024

మీతోటే మొదటి బోణి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణకు సంతోషం

హరీశ్ రావుకు కుటుంబ సమేతంగా ఆత్మీయ ఏకగ్రీవ తీర్మానం అందజేసిన మాల ఎంప్లాయిస్ అసోసియేషన్.

సిద్ధిపేట: ఆత్మీయ ఏకగ్రీవ తీర్మానం ఇవ్వడం, మీతో మొదటి బోణి కావడం. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణకు నాకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.  జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఆదివారం మాల ఏంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఆత్మీయ తీర్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ లతో కలిసి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. డా బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సిఎం కెసిఆర్ రాష్ట్ర రాజధానిలో 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. ఎంఇఎపి కోరినట్లుగా 500 గజాల స్థలాన్ని కేటాయింపు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

అంతకు ముందు సిద్ధిపేట వాసులుగా మీరంతా అదృష్టవంతులని, తెలంగాణ రాష్ట్ర జాతిపిత సిఎం కెసిఆర్ ఆలోచన విధానాలు అమలు చేసేది మంత్రి హరీశ్ రావు అని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు అండగా ఉంటామని మాల ఏంఫ్లాయిస్ అసోసియేషన్-ఎంఇఎపి ఆధ్వర్యంలో ఆత్మీయ తీర్మానం చేయడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. మొదట మీతోనే శంఖం పూరించినట్లు మూడవ సారి కూడా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని సిఎం కెసిఆర్ ఉంటారని, సిద్ధిపేటలో హరీశన్న విషయానికొస్తే చెప్పేదేమీ లేదని, మీరే అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానంతో స్పష్టతనిచ్చారని కిషోర్ ప్రశంసించారు.

సిద్ధిపేట మాల ఏంఫ్లాయిస్ ఏకగ్రీవ తీర్మానం.

సిద్ధిపేట ప్రజా సేవకులు, అభివృద్ధి సాధకులు, జనం మెచ్చిన నాయకులు, రాష్ట్ర, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావుకు మాల ఏంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “ఆత్మీయ తీర్మానం” అందజేయాలని నిర్ణయించామని చెప్పారు.  మాది సిద్ధిపేట నియోజకవర్గమని గర్వపడేలా అన్నీ రకాలుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన మంత్రికి హృదయపూర్వక నమస్కారం అని తొమ్మిదేళ్ల క్రితం ఉన్న సిద్ధిపేటతో పోల్చితే సిద్ధిపేట నియోజక వర్గాన్ని అద్భుతంగా, ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజారోగ్యం, తమ పిల్లల చదువులు, విద్యా, వైద్య రంగం పటిష్టం చేశారని ప్రశంసించారు. పచ్చని చెట్లు, పరిశుభ్రతతో ఉండేలా నియోజక వర్గాన్ని అందంగా తయారు చేయడంలో మీ కృషి ఎంతో ఉందని, మాకు కూడా రైతు కుటుంబాల నేపథ్యం ఉందని, ఒకప్పుడు బీడు బారిన వ్యవసాయ భూములన్నీ ఇవాళ మీ శ్రమవల్ల నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పచ్చగా కళకళలాడుతుందన్నారు.

విద్యాసంస్థలతో పాటు సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా సిద్ధిపేటకు తీసుకురావడంలో హరీష్ రావు పాత్ర అభినందనీయం కొనియాడారు. మా కుటుంబాలలో ఒక సభ్యుడిగా, మా కష్ట సుఖాలలో మాకు తోడుగా ఉంటున్న మీకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని చెప్పడం చాలా చిన్నమాట అని మెచ్చుకున్నారు. అహర్నిశలు సిద్ధిపేట ప్రగతి కోసం పాటు పడుతున్న హరీష్ రావు అన్ని వేళలా మా సహకారం ఉంటుందని, మీరు నిర్దేశించిన లక్ష్యాలకు అండగా ఉంటామని ఆత్మసాక్షిగా ప్రకటిస్తూ ఈ ఆత్మీయ తీర్మానాన్ని మీకు అందజేయాలని నిశ్చయించుకున్నామన్నారు. మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వామి దాస్, డిప్యూటీ తహశీల్దార్ రాజేశం, అసోసియేషన్ సంఘ సభ్యుల కుటుంబ సమేతంగా మంత్రికి తీర్మానం పత్రాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News