Sunday, January 19, 2025

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రకటించిన సెకండ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో వీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో సోమవారం ఆయన నివాసానికి వెళ్లి కలిసిన హరీశ్ రావు.. విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీల చేరాలని కోరారు. అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో విష్ణువర్ధన్ రెడ్డికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విష్ణువర్ధన్ రెడ్డి పనిచేశారని.. బీఆర్ఎస్ లో విష్ణుకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News