Sunday, December 22, 2024

ఎంఎల్‌సి కవితతో హరీశ్‌రావు ములాఖత్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిశారు. శుక్రవారం ఉదయం ములాఖాత్ సమయంలో ఆమెను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. గతంలోనూ కవితను ఆమె సోదరుడు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహా పలువురు పార్టీ నేతలు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ మహిళా నేతలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కవితతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News