తనఖా పెట్టామని
అసెంబ్లీలో చెప్పారు
తాకట్టు
పెట్టుకోలేదంటున్న
ఐసిఐసిఐ ఇంతకీ
ఆ భూములను
ఎవరికి తనఖా
పెట్టినట్లు ఎక్స్
వేదికగా ఎంఎల్‌ఎ
హరీశ్‌రావు ప్రశ్న’
మన తెలంగాణ/హైదరాబాద్ : టి జిఐఐసి ద్వారా 400 ఎకరాలు తన ఖా పెట్టి రుణం పొందామని అసెం బ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభు త్వం సమాధానం చెప్పిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. తాము ఆ భూమిని తనఖా పెట్టుకోలేదని ఐసిఐసిఐ బ్యాంకు చెబుతోందని, మరి ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టి నట్లు..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నిం చారు. రేవంత్ తన బ్రోకర్ కంపెనీ లకు తనఖా పెట్టారా..? అని నిలదీ శారు. 400 ఎకరాల తనఖా విష యంలో దాగి ఉన్న చీకటి కోణం ఏ మిటో చెప్పాలని, ప్రభుత్వం దీని మీ ద శ్వేత పత్రం విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐసిఐసిఐ బ్యాంకు వివరణ, తనకు ప్రభుత్వ ఇచ్చిన సమాధానం కాపీలను ఎక్స్‌లో ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.