Wednesday, January 22, 2025

వికృత చేష్టలు వద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బుల్డోజర్ రాజ్ పాలన సాగుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రతిపక్ష నేత, కాంగ్రె స్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి రం మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ర చించిన రాజ్యాంగం ఆధారంగా కాదని, అధికార దు ర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభు త్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొ క్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మూసి రివర్ ఫ్రంట్, హై డ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. మీ పార్టీ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలన కు బుల్డోజర్ ప్రతీకగా మారిందని,

అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందన్నారు. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని, ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వా రి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ బుల్‌డోజర్ పాలన నడుపుతున్నారని పేర్కొన్నా రు. బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారిందని, అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ మీ పార్టీ ముఖ్యమంత్రి పాల న కొనసాగుతుందన్నారు.

బిజెపి దారిలోనే కాంగ్రెస్
బుల్డోజర్లు 100 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లను, కార్యాలయాలను, రహదారులను, ఇతర నిర్మాణాలను ని ర్మించడానికి ఉపయోగించారని, కానీ ఇప్పుడు జాతీ య పార్టీలైన బిజేపీ, కాంగ్రెస్‌లు నిర్మాణాలను కూ ల్చేందుకు ఉపయోగించడం దుర్మార్గమన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మ హారాష్ట్ర రాష్ట్రాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బు ల్డోజర్లను ఎలా ఉపయోగించిందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తున్నదని, ఈ విషయంలో బీజేపీ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నదన్నారు. కూల్చివేతల మీద సుప్రీం కోర్టు తా జా తీర్పు ఉన్నప్పటికీ తగిన సర్వేలు నిర్వహించకుం డా, సరైన విధానాలను అనుసరించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజ్ చే స్తూ, వారిని కన్నీరు పెట్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చే శారు. పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించే విధంగా మీ ము ఖ్యమంత్రికి సలహా ఇవ్వాలని లేఖలో కోరారు.

వికృత చేష్టలు వద్దు
మంత్రి సురేఖపై జరిగిన ట్రోలింగ్‌కు ఖండన
మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ట్రోలింగ్ మీద బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కొండా సురే ఖ పట్ల జరిగిన ఘటనను ఆయన ఖండించారు. ఇలాంటి వికృత చేష్టలు సరికాదన్నారు. ఈ మే రకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్క రూ సహించరని తెలిపారు. ఈ విషయంలో బీ ఆర్‌ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తాను అ యినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కొం డా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీ డియా వేదికగా జరిగే ఇలాంటి పైశాచిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అందరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News