Wednesday, January 29, 2025

ఆరు గ్యారంటీలు అమలయ్యేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టం:హారీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలు అమలు అయ్యేంతవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. గురువారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేను రంగనాయక్‌సాగర్ వద్ద భూ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆ చరిత్ర నీదని విమర్శించారు. తాను చట్టబద్దంగా రైతుల పట్టాభూములు ధరణి ద్వారా 13 ఎకరాలు కోనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చారు. సెంట్ భూమి ఇరిగేషన్ భూమి కాని, ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడలేదన్నారు. నీవు ఎప్పుడు టైమ్ ఇస్తావో రా నీ ముందే సర్వే చేయిస్తానని సవాల్ చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. దానిని సంపూర్ణమైన న్యాయం చేస్తామన్నారు.

వరంగల్ డిక్లరేషన్ సభలో నువ్వు రైతులకు తోమ్మిది హామీలు అమలు చేస్తానని ప్రకటించావు. ఇందులో ఒక హమీ అయినా నెరవేర్చ గలిగావా అని ప్రశ్నించారు. ఎక కాలంలో రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం వడ్ల కోనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మరో పక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యన్ని కొంటామని ప్రకటించారు. దీని అంతర్యమేమిటని ప్రశ్నించారు. మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడ పోయిందో చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రంలో తెరుచుకోకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత గిరిజన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొతున్నట్లు చెప్పారు. కంపేనీ నిర్మాణాల కోసం ఆ భూములను తన అప్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విమశ్వించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి,నారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు సాయికుమార్, డి.బి.నాగభూషణం, వెంకటేశం, శివచందర్, మల్లేశం, సత్యం నాగిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News