Friday, January 10, 2025

ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చిన సిఎం:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని అన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే అని పేర్కొన్నారు.

అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని వెల్లడించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు..?.. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..? అని నిలదీశారు. గతంలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారని, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా అంటూ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్..?..దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి..? అంటూ హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News