Saturday, April 5, 2025

రాహుల్‌జీ.. ఎందుకీ మౌనం?

- Advertisement -
- Advertisement -

మీ నీతిసూత్రాలను తుంగలో
తొక్కుతున్న సిఎం రేవంత్ చర్యలు
కనిపించడం లేదా? మీరు
రాజ్యాంగ విలువల గురించి
మాట్లాడుతుంటే ఇక్కడ రేవంత్ నిత్యం
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
బుల్డోజర్ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీరు
తెలంగాణలో సాగుతున్న బుల్డోజర్
రాజ్ గురించి మాట్లాడరెందుకు?
హైడ్రా ముసుగులో పేదల ఇళ్లు
కూల్చడం మీకు కనిపించడం లేదా?
హెచ్‌సియులో సిఎం రేవంత్ సాగిస్తున్న
దుర్మార్గాలను ఖండించరెందుకు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి
హరీశ్‌రావు బహిరంగలేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. మీరు రాజ్యాంగ విలువల గురించి దేశం మొత్తం తిరిగి మాట్లాడుతుంటే, రేవంత్ తన అనాలోచిత, అవగాహనరాహిత్యం వల్ల నిత్యం రాజ్యాంగ్యా న్ని అవమానిస్తున్నారని రాహుల్‌గాంధీని ఉద్దేశి స్తూ వ్యాఖ్యానించారు. ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయిస్తే అటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై అయ్యేలా చ ట్టం చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మా టలకు విరుద్దంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని చెప్పారు. ఇదే విషయంపై సుప్రీం కో ర్టును సైతం అవమానపరిచే విధంగా అసెంబ్లీ లో పల, వెలుపల చేసిన రేవంత్ వ్యాఖ్యల పట్ల సు ప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడ హైడ్రా, మూ సీ ప్రక్షాళన పేరిట బుల్‌డోజర్లు పంపి పేద, మ ధ్య తరగతి ఇండ్లు కూలగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ విధ్వంస పూరిత వైఖరి హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి వందల ఎకరాల్లో విధ్వంసానికి తెరతీసిందని, జాతీయపక్షి నెమలి సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయని అన్నారు. మరోవైపు ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నినదిస్తున్న హెచ్‌సి యు విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టీకం అందరిని తీవ్రంగా కలిచి వేసిందని, ఒక్క కాం గ్రెస్ పార్టీ మినహా హెచ్‌సియు విషయంపై ఎన్‌ఎస్‌యుఐ సహా అన్ని పార్టీలు, వర్గాలు తీవ్రంగా ఖండించాయి, వ్యతిరేకించాయని తెలిపారు.రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్‌సియు సందర్శించిన రాహుల్‌గాంధీకి అప్పటి తమ ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చి, పోలీసు బందోబస్తు ఇచ్చి నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించిందన్న విషయాన్ని హరీష్‌రావు గుర్తు చేశారు. ఆ సమయంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని

హెచ్‌సియు విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చిన విషయం గుర్తుందా..? అని అడిగారు. నేడు అదే యూనివర్సిటీలో మీ సిఎం రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరు మౌనంగా ఉండటం సెంట్రల్ యూనివర్సిటీతో సహా యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చేదాక కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సియులో విధ్వంస కాండను ఆపలేదని, హెచ్‌సియు విషయంలో మీరు, మీ పార్టీ మౌనంగా ఉండడానికి కారణం తెలపాలని హెచ్‌సియు విద్యార్థులు, యావత్ తెలంగాణ ప్రజల తరుపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామని రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

మీరు క్రోనీ కాపిటలిజంకు వ్యతిరేకంగా, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా గట్టిగా పోరాటం చేస్తుంటే, ఇక్కడ మీ ముఖ్యమంత్రి ఆదానీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారని అన్నారు. ఆదానీ సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణ కోసం నల్గొండ జిల్లాలో రైతులపై పోలీసులు దాడి చేస్తే, మీరు మౌనంగా ఉండి పోయారని చెప్పారు. ఫార్మావిలేజ్ పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు రేపి, ఆదివాసీ రైతులను చితగ్గొట్టి, బేడీలు వేస్తే మౌన మునిగా మిగిలిపోయారని లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు మీరు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, మరోవైపు మీ ముఖ్యమంత్రి ఆయనను ‘బడే భాయ్’ అని సంభోదిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ మీ అంగీకారంతో జరగుతున్నాయా, లేక మీకు తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా..? అనే దానిపై తెలంగాణ సమాజం మీ నుండి స్పష్టమైన వివరణ ఆశిస్తున్నదని పేర్కొన్నారు. మీరు ప్రవచిస్తున్న నీతి సూక్తులను మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పాటించే విధంగా తగు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నానని రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News