Tuesday, November 5, 2024

బోధన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పౌష్టికాహారం అందని గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ 21వ తేదీన ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రకటించారు.
గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు.తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చునని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..హంస హోమియో మెడికల్ కాలేజీలో ఈరోజు 75 పడకల బోధన ఆసుపత్రి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.ఆయుష్ కి మంచి భవిష్యత్ ఉంది. మారుతున్న పరిస్థితుల నేపధ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకీ ప్రాధాన్యత పెరుగుతున్నది. ప్రజలు దీనిపై ఆసక్తి చూపుతున్నారని, ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని ఆయన అన్నారు.(ఆయుష్) ఆయుర్వేదం , యోగ, నాచురోపతీ, యునాని, సిద్ధ, హోమియో ఇందులో దేని ప్రత్యేకత దానిదే.

తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో బస్తీలో పల్లెల్లో వైద్యం అందించేందుకు బస్తీ పల్లె దవాఖానాలు కెసిఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చామని,పల్లె దవాఖానాలో పని చేసేందుకు ఆయుష్ డాక్టర్లను కూడా మేము రిక్రూట్ చేస్తున్నామన్నారు.ఇదే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయుష్ సెక్రెటరీ రాజేష్ కొటేషన్ కూడా పంపడం జరిగింది.వివిధ రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్‌లో వైద్యం పొందేందుకు హెలికాప్ట‌ర్‌ల‌లో పేషెంట్లు వ‌స్తున్నారు. ఆయుష్ వైద్యం పొందేందుకు కూడా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇక్క‌డికి రావాలన్నారు. ఇందుకు అన్ని ఆయుష్ విభాగాలను పటిష్టం చేస్తున్నాం.

నేచ‌ర్ క్యూర్ ఆసుప‌త్రి కోసం రూ. 6కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం.సిద్దిపేట లో ప్రారంభించుకున్నట్లే, వికారాబాద్,
జయశంకర్ భూపాలపల్లిలో 50 పడకలతో కూడిన ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నాము. ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నెముక కీళ్ల సమస్యలు పక్షవాతం వంటి దీర్ఘ కాలిక సమస్యలకు చికిత్సలు అందిస్తున్నాం.

ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మెరుగైన వైద్యం తెలంగాణలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని,ప్రపంచం భారతదేశంలో ఉన్న ఆయుష్ వైద్యం వైపు చూస్తుందన్నారు. ప్రపంచంలో మంచి ఆయుష్ వైద్యం అందిస్తున్న దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉందిదని,ఇక్కడ ఉండే విద్యార్థులు రేపటి ఆయుష్ వైద్యులుగా సమాజానికి మరింత సేవను అందించేందుకు మంచి ప్రాక్టీస్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానని అన్నారు .రాష్ట్రంలో కరోనా వైరస్ లాగా అనవసరపు సీ సెక్షన్లు వ్యాప్తి చెందాయి.

తల్లి బిడ్డ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అవసరం ఉంటే తప్ప సీ సెక్షన్ చేయవద్దని డాక్టర్లను ప్రజల కు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని,అనవసరపు సీ సెక్షన్ చేయడం వల్ల తల్లికి మొదటి గంటలో పాలు రాకపోవడం తో పుట్టే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం మనం కోల్పోతున్నామని ఆయన అన్నారు.గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం వారికి పోషిక ఆహారం అందని గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ 21వ తేదీన ప్రభుత్వం ప్రారంభించబోతుందని, గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించవచ్చునని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News