Monday, December 23, 2024

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: మంత్రి హరీశ్ రావు సీరియస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ర్యాగింగ్ నిషేధమని, రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఆదేశించామని, ఈ ఘటనకు కారకులను వదిలిపెట్టమని మంత్రి అన్నారు. నిన్న మెడికల్ కాలేజీలో సీనియర్లు, ఓ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన గటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థి దుస్తులు విప్పించి ఫోటోలు తీసి ర్యాగింగ్ చేశారు. దీంతో సదరు విద్యార్థి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు హైదరాబాద్ నుంచి డయల్ 100కి ఫోన్ చేశారు. దీంతో అక్కడికి చేరుకుని సీనియర్ల నుంచి విద్యార్థిని రక్షించిన పోలీసులు 25మందిపై కేసు నమోదు చేశారు.

Harish Rao orders enquiry on Ragging in Suryapet Medical College

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News