Friday, April 25, 2025

తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం ఉంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. ఈ పాదయాత్ర రేపటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతుందని, నాడు సిద్దిపేట నుంచే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని గుర్తు చేశారు.  సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాంపల్లి అమర వీరుల స్థూపం నుండి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అమర వీరుల కు నివాళ్లు అర్పించి జెండా ఊపి పాదయాత్రను  ప్రారంభించారు. కాశ్మీర్ పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందని ప్రశంసించారు. కెసిఆర్ అనే ఒక గొంతే కోట్ల గొంతుకలను ఏకం చేసిందని హరీష్ రావు కొనియాడారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షంగా ఉందని తెలియజేశారు. లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి అనాడు రామదండు కదిలిందని, నేడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందన్నారు.

1969లో చాలామంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థులు మరణించారని గుర్తు చేశారు. కెసిఆర్ నాయకత్వంలో అంబేద్కర్, గాంధీల మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నారన్నారు. అదే పద్ధతిలో కెసిఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారని, సమైక్యవాదులు, ఢిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని హరీష్ రావు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News