సిద్దిపేట: రైతు వ్యతిరేక బిజెపికి గుణ పాఠంచెప్పాలని, బిజెపి రైతుల ఉసురు పోసుకుని కార్పోరేట్ వర్గాలకు లాభం చేస్తోంది.. బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై గజ్వేల్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”కేంద్రం, రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. వడ్లు కొనే ప్రయత్నం నుంచి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తప్పుకుంటుంది. 70ఏళ్ల నుంచి కొన్న కేంద్రం ఇప్పుడు ఎందుకు వడ్లు కొనదు. బీజేపీ వాళ్లు మోసం చేస్తున్నారు. వడ్లుకొనకుండా రైతులను దగా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రైతు బాగపడుతున్నడు. రైతు ఆగం కావద్దన్నదే మన తన్నులాట తప్ప. బీజేపీ వాళ్లు కొంటామంటే మనం వద్దు అంటున్నమా. కిషన్ రెడ్డి.. రైతు మీద ప్రేమ ఉంటే మీ ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొంటవా కొనవా.. అది చెప్పు ముందు. కొనిపించి మాట్లాడుతప్ప నీ సొల్లు పురాణం ఎవరూ వినరు. తెలంగాణలో పండేదే బాయిల్డ్ రైస్. ఎండకాలం వేడి ఎక్కువ కనుక రా రైస్ ఇక్కడ నడవదు. నూకలయితది. ఇంత కాలం అమ్మింది అదే… కేంద్రం కొన్నది అదే. ఇప్పుడు ఎందుకు కొనవో చెప్పు. బీజేపీ నేతలు గ్రామాలకువస్తే గళ్లా పట్టుకుని అడగాలే. బిజెపి నాయకులు గొంతు పెద్దగా చేసి మాట్లాడతున్నారు. గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు పెంచి నడ్డి విరుచుడు తప్ప ఎం చేసిండ్రు. కేంద్ర మంత్రి కుమారుడు రైతుల మీద కారు ఎక్కిస్తే అరెస్టు చేయలే.. మీరా రైతులు కోసం మాట్లాడేది. కార్పోరేట్ శక్తుల కొమ్ము కాసే పార్టీ బీజేపీ. మనం చివరి వరకు పోరాడాల్సిందే. రైతుల బతుకు బాగవ్వాలంటే బీజేపీని దించాల్సిందే. ఎరువుల ధర పెంచారు. బాయిల కాడ మీటర్లు పెడతామంటారు. ఇలా చేస్తే రైతులు బాగుపడతరా. రైతులు బాగుపడాలంటే బిజెపి గద్దే దిగాల్సిందే” అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Harish Rao participate in TRS Protest against Centre