Tuesday, January 21, 2025

గడి మైసమ్మ బోనాల ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: జిల్లాలో గడి మైసమ్మ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గడి మైసమ్మ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ మంత్రి హరీశ్ రావు అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రతీ యేటా ఆషాడ మాసం పురస్కరించుకుని జరిపే బోనాల ఉత్సవాల్లో భాగంగా ప్రప్రథమంగా వైశ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆదివారం ఈ బోనాల ఉత్సవంలో వందలాది మహిళలు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ మేరకు వార్డు కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం పర్యవేక్షణ, వైశ్య నిర్వాహకులు కూర శ్రీను, స్వప్న ఆధ్వర్యంలో ఈ లాల్ కమాన్ గడి మైసమ్మ బోనాల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News