Monday, December 23, 2024

రుణమాఫీపై మాట తప్పిన సిఎం… యాదాద్రిలో పాపపరిహార పూజ చేసిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పినందుకు హరీష్ రావు పాపపరిహార పూజలు చేశారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ హరీష్ రావు ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశారు. రుణమాఫీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ హరీష్‌రావు ఆలయాల పర్యటన చేపట్టారు. యాదాద్రి నుంచి ఆయన ఆలయాల పర్యటన ప్రారంభించారు. తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదని  రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు అన్నదాతలతో కలిసి ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News