Sunday, December 22, 2024

రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : తెలంగాణలో ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని బిజెపి నాయకులు అడుగుతున్నారని, మొదలు ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్‌గూర్‌లో దీన్ దయాళ్ జాతీయ పంచాయతీ అవార్డులను 27గ్రామ పంచాయితీ సర్పంచ్‌లకు మంత్రి హరీశ్‌రావు సర్పంచులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పదివేల నష్టపరిహారం అందజేస్తున్నారన్నారు. బిజెపి పార్టీ పదివేళ్లు సరిపోవు అంటున్నారన్నారు.

బిజెపి నాయకులు ఢిల్లీ నుంచి పది వేలు తీసుకు వస్తే రాష్ట్రం నుంచి పది వేలు కలిపి రైతుకు 20వేల పరిహారం అందిందామన్నారు. దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలను పెంచి పేదలపైన భారం మోపింది బిజెపి ప్రభుత్వం అని విమర్శించారు. బోరు మోటార్లకు మీటర్లు పెట్టింది బిజెపి పార్టీ అని, మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 5రోజులకు ఒక సారి తాగునీరు వస్తుందని, కర్ణాటకలోని బీదర్‌లో ప్రజలు బోరు బావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారని ది బిజెపి పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఇంటింటికి రోజు తాగు నీరు వస్తుందని ఇది తెలంగాణ మోడల్ అన్నారు. ప్రధాన మంత్రి మోడీ అయిన తర్వాత దేశంలో అదానీ ఆస్తులు పెరిగాయని, పేదల జేబులకు చిల్లులు పడ్డాయన్నారు. ప్రధాన మంత్రి సంసద్ యోజనలో 10కి 10తెలంగాణ గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు.

సర్పంచ్‌లకు శుభవార్త చెబుతున్నామని ఏప్రిల్ 1నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్‌లలో వేస్తామని, పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామన్నారు. గతంలో సర్పంచ్‌లకు కాలీపోయిన మోటర్‌లకు రిపేర్ చేయించుడే పని బావులను తవ్వే పని ఉండే అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24గంటల కరెంట్ వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఫసల్ వాదీ సర్పంచ్ నిర్మళదేవీ, కొండల్‌రెడ్డి, మనోహర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News