Monday, January 20, 2025

ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయానిదే గెలుపు:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, అక్రమ కేసులు సరికాదని మాజీ మంత్రి , సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎంఎల్‌ఎలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, గూడెం మహీపాల్‌రెడ్డితో కలసి శుక్రవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్‌చెరు ఎంఎల్‌ఎ గూడెం మహీపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. అక్రమ కేసులు న్యాయస్థానంలో నిలబడవని అన్నారు.

కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తయారైందని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించిన పటాన్‌చెరు ఎంఎల్‌ఎ జిఎంఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు సరైంది కాదన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పూనుకోలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరకపోవడం వల్లనే తమ ఎంఎల్‌ఎలు, నేతలపై కక్ష కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్ట్టీలో చేరాలి.. లేదంటే అక్రమ కేసులు అన్నట్టుగా మారిందని ఎద్దేవా చేశారు. అయినా కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

తన తమ్ముడి అరెస్టుపై ఎంఎల్‌ఎ మహీపాల్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.00 గంటల సమయంలో తన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకే అరెస్టు జరిగిందని ఆరోపించారు. తన తమ్ముడిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని, నోటీసులు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా కోర్టుకు పంపారని విచారం వ్యక్తం చేశారు. క్వారీకి 2027 వరకు అనుమతి ఉన్నదని, ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదని,

తప్పు చేస్తే పెనాల్టీ వేయాలని, దొంగను అరెస్టు చేసిన మాదిరిగా తెల్లవారు జామున మూడు గంటలకు పోలీస్‌లు దాడులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పదుల సంఖ్యలో క్రషర్లు ఉన్నప్పటికీ తమపై కక్షతోనే తన తమ్ముడిని అరెస్టు చేశారని విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే అన్ని అనుమతులు పొంది క్రషర్‌లు నడుపుతున్నామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News