Monday, December 23, 2024

చట్టబద్ధంగా రావాల్సిన నిధుల్లోనూ కోత

- Advertisement -
- Advertisement -

Minister Puvvada Ajay Kumar slams Revanth Reddy

13,14,15వ ఆర్థిక సంఘాల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.7,183కోట్లు వెంటనే విడుదల చేయాలి
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చాలా స్పష్టంగా వివరాలిచ్చారు
దానికి సమాధానం ఇవ్వకుండా బిజెపి నేతలు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
సమైక్య రాష్ట్రంలో పాలకులు మాట్లాడిన రీతిలోనే బిజెపి నేతలు మాట్లాడుతున్నారు 
నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని అనేకసార్లు కోరాం ఫలితం లేకపోగా రాష్ట్ర నిధులను ఎపి ఖాతాలో జమ చేశారు
హైవేలు ఇచ్చాం అంటున్నారు.. టోల్‌గేట్లు పెట్టి ప్రజల నుంచి పిండుకోవడం లేదా? : టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో మీడియాతో
భేటీలో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: మూడు ఆర్థిక సంఘాల (13,14,15వ ) సిఫారసుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన మొత్తం రూ. 7,183 కోట్లును తక్షణమే కేం ద్రం విడుదల చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఈ నిధులపై కేంద్రం పెత్తనం ఏమిటని నిలదీశారు. రావాల్సిన నిధుల్లో కూడా కేంద్రం కోత ఆయన మండిపడ్డా రు. ఈ విషయంలో నరేంద్రమోడీ సర్కార్ చాలా మొండిగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రా ల నుంచి వస్తున్న అభ్యర్థులను కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తనకు అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రంలోని బిజెపి ప్ర భుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆ యన దుయ్యబట్టారు. నుంచి రావాల్సి న లెక్కలపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చాలా స్పష్టంగా వివరాలు చెప్పారన్నా రు. దానిపై బిజెపి నేతలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పైగా వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారన్నారు. తాను ఆర్థిక మం త్రిగా సాధికారికంగా నిధులకు సంబంధించి లె క్కలు విడుదల చేస్తున్నానని, హక్కుగా రావాల్సిన బకాయిలు కూడా తొక్కి పెట్టారని ఆ రోపించారు.

టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శాసనసభ్యులు ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్, జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బిజెపి నాయకులపై తీవ్రస్థాయిలో వి రుచుకపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ్ యాత్రలో పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన గోబెల్స్‌ను మంచిపోయారని విమర్శించారు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో పాలకులు మాట్లాడిన మాటలే.. ఇవాళ బిజెపి నేతలు మాట్లాడుతున్నారన్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రిని తాను అనేక సార్లు కోరామన్నారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎపి ఖాతాలో జమచేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి హైవేలు ఇచ్చామని బిజెపి నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారని…. అయితే టోల్‌పెట్టి ప్రజల నుంచి రుసం వసూలు చేయడం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే మరి తెలంగాణ మాదిరిగానే పక్క రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి కనిపించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు? గద్వాలలో ఉన్న ప్రగతి రాయచూర్‌లో ఉందా? చెప్పాలంటూ కమలం నేతలను నిలదీశారు.
కాకి కబుర్లు చాలించండి!
రాష్ట్రానికి రూ. 3లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని బిజెపి జూటా ప్రచారం చేసుకుంటోందని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. .పల్లెలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తే తెలంగాణ పల్లెలాగా వేరే రాష్ట్రాల పల్లెలు ఎందుకు లేవన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే….రా! రాయచూరు వెళ్లి చూసొద్దాం…. అక్కడ పల్లెల పరిస్థితి …మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బేరజువేద్దామా? అని సవాల్ విసిరారు. బిజెపి నేతలవి అంతా జూటా బోగస్ మాటలేనని మండిపడ్డారు.ప్రజా సంగ్రామ యాత్రలోనే బండికి రాయచూరు రైతులు తెలంగాణ పథకాలు తమ రాష్ట్రమైన కర్ణాటక బిజెపి సిఎఁతో ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పంచాయతీలకు కేంద్రమే ఇస్తే….రాష్ట్రంలో లాగా లాగా గ్రామాల్లో ట్రాక్టర్లు,. డంప్ యార్డులు, వైకుంఠ దామాలు వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవన్నారు. పల్లె ప్రగతి…. పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు బండి సంజయ్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో మలేరియా కేసులు తగ్గాయని కేంద్రమే అవార్డు ఇచ్చిందన్నారు. ఇది కూడా సంజయ్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బిజెపి అంటే బడా జూటా పార్టీ, బుల్డోజర్ పార్టీ,, బుట్ట చోర్ పార్టీ గా మారిందని ధ్వజమెత్తారు.
ఆదాయానికి గండి కొడుతున్న కేంద్రం
సెస్‌ల రూపంలో రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతోందని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పన్నుల్లో 41 శాతం వాటా రావాల్సి ఉన్నా సెస్‌ల పుణ్యమాని 25 శాతానికి మించడం లేదన్నారు. రాష్ట్రాలను బలహీన పరిచే కుట్రకు కేంద్రం తెరలేపిందన్నారు. రాష్ట్రాల నుంచి 11 శాతం ఆదాయాన్ని సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తోందన్నారు. ఎందరో ఆర్థిక వేత్తలు మోడీ దగ్గర పని చేయలేక మధ్యలోనే మానేశారన్నారు. వారిలో అరవింద్ సుబ్రమణ్యం, అరవింద్ పనగరియా, ఊర్జిత్ పటేల్ తదితరులు ఉన్నారన్నారు. వారు తమ పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు.
బండికి దేనిపైనా అవగాహన లేదు
బండి సంజయ్‌కి ఏ సబ్జెక్టుపై అవగాహన లేనట్టు కనిపిస్తోందని, రాజోళి బండ ప్రాజెక్టుపై ఆయన మాట్లాడుతున్న తీరును చూసి నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వంపై ఉత్తుత్తి మాటలు చెప్పడం మానుకోవాలన్నారు. దమ్ముంటే బండి, కిషన్‌రెడ్డిలు తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లోని కెన్ బట్వా, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు.. రాష్ట్రంలోని పాలమూరు – రంగారెడ్డికి ఎందుకివ్వరని ప్రశ్నించారు. నేతలకు తిట్ల పురాణం తప్ప మా నిజాలు జీర్ణం కావన్నారు. తుమ్మిళ్లను పదినెలల్లోనే పూర్తి చేసి 55వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
డికె అరుణ మంత్రిగా పాలమూరు సాగునీళ్ల కోసం ఏం చేయలేక పోయారని, గద్వాల ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు లేవని బీజేపీ సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గద్వాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఐసియూ డయాలసిస్ సెంటర్ గద్వాలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ వాస్తవాలు డికె అరుణకు తెలియవా? మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్‌డిఎస్‌కు ఆమె అన్యాయం చేస్తే సిఎం కెసిఆర్ న్యాయం చేశారన్నారు.కూడా తొక్కి పెట్టారని ఆ రోపించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శాసనసభ్యులు ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్, జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బిజెపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై బిజెపి రాష్ట్ర శాఖ

Harish Rao Press Meet at TRS Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News