Wednesday, January 22, 2025

కాంగ్రెసోళ్లు సభలో అన్ని అబద్ధాలే చెప్పిండ్రు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్ధాలు చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సభల్లో చెప్పినట్లే సభలోనూ పూర్తిగా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటామన్న కాంగ్రెస్ నేతల.. విపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు. పిపి నర్సింహారావును ఢిల్లీ నాయకత్వం అమమానిస్తే.. నోరు విప్పలేదు.. ఆనాడు టి. అంజయ్యను రాజీవ్ గాంధీ ఎలా అవమానించారో మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తాము ప్రతి కార్యక్రమాన్ని అమరవీరులను తలుచుకుంటూనే ప్రారంభించామని వెల్లడించారు.

సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుల విషయంలో రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరన్నారు. విపక్షనేతలు మాట్లాడకుండా సభను వాయిదా వేసుకుని పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందన్న హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాదిలో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది.. బిఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదని లెక్క చెప్పారు. బిఆర్ఎస్ పాలన, విధానాల వల్లనే రైతుల ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చాయని హరీశ్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News