Sunday, November 24, 2024

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే… రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే… రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టారని.. తెలంగాణ రైతుబంధును మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని హరీష్ రావు అన్నారు. తు బంధు పథకం ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదు.. కరోనా సమయంలో కెసిఆర్.. ఎమ్మెల్యేలు, అధికారుల జీతాల్లో కోత పెట్టి రైతుబంధు ఇచ్చారు.

కాంగ్రెస్ అంటనే.. రైతు వ్యతిరేకి ప్రభుత్వమని చెప్పారు. రైతులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రైతులపై కోపం పెంచుకుందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రైతులు బాధపడుతున్నారని తెలిపారు.

ఎన్నికలు వచ్చాయని రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు బంధు ఉండదని, కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో రోజూ రైతుల ఆత్మహత్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News