సిద్ధిపేట: జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి రక్షా బంధన్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని అన్నారు.. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతను పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవలన్నారు. ఈ పండుగను అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. అక్కతమ్ముళ్ల, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని.. సోదరుడు సోదీరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటునన్నారు.
సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తున్నది అని, ప్లాస్టిక్ నిర్మూలించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని.. అది సందర్భం ఏదైనా క్రొత్తదనానికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు కాకుండా సహజ సిద్ధంగా ఉండే ఆకులు, పువ్వులతో ఈ ఏటా నుండే తమ్ముళ్లకు అన్నయ్యలకు “ఏకో ప్రెండ్లి రాఖీ ” కట్టాలి అనే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ మహిళలలు స్పూర్తిగా నిలుస్తున్నారని, మానవ ఆరోగ్యం పట్ల ఆలోచించి మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో నిరంతరం కోనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.