Monday, December 23, 2024

గోబెల్స్, నోబెల్స్ మధ్యే పోటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఆర్‌టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర గవర్నర్ అడ్డుపడి ఎన్ని అటంకలు సృష్టించినప్పటికీ చివరికి ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనాన్ని ఆమోదిస్తూ గురువారం నిర్ణయం తీసుకోవడం శుభపరిణా మం అని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. గురువారం ఖమ్మం నగరంలో ప్రభుత్వ మెడికల్ క ళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్‌టిసి సంస్థ్ధను దెబ్బతిసి ప్రైవేటుపరం చేసేందుకు గత పాలకులు
కృషి చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్‌టిసి కార్మికుల చిరకాల కలను నిజం చేశారన్నారు.

ధర్మం, న్యాయం గెలుస్తుంది అనేదానికి ఆర్‌టిసి బిల్లును అమోదించడమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ ఇది కెసిఆర్ ఇచ్చిన బహుమతిఅని ఆయన అన్నారు. ఇక నుండి ఆర్‌టిసి కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్‌టిసి ఉద్యోగులు కూడా ట్రేజరీ నుంచి జీతాలు తీసుకోవచ్చన్నారు. ఆర్‌టిసి కార్మికుల జీవితాల్లో ఈరోజు మరపురాని రోజుగా మిగులుతుందన్నారు. మా ప్రభుత్వం ఆర్‌టిసికి కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసిందన్నారు.ఆర్టీసి కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా పనిచేసిన తాను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూన్నట్లు ఆయన ప్రకటించారు.

పాలమూర్ పై ప్రతిపక్షాలవి శకుని పాత్ర
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే పాలమూరు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల16న ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతూ శకుని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతి పక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఎక్కడైన కరువు పీడిత ప్రాంతాల విమూక్తికి సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఆయా ప్రాంతాల్లోని ప్రతిపక్షాలు స్వాగతిస్తాయని కాని తెలంగాణలో మాత్రం శాపనార్థాలు పెడుతూ అపశకనం మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పాలమూరు జిల్లా ప్రజలంతా పాలమూరు ప్రాజెక్టును పండగలా భావిస్తే, ప్రతిపక్షాలు దండగ అంటున్నాయని ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతి పక్షాలే దండగ అని ఆయన ఎద్దెవా చేశారు.

తెలంగాణ వచ్చిన తరువాత ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని కాళేశ్వరం, పాలమూరు, నెట్టంపాడు ఇలా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని దీనిని జీర్ణించుకోలేకనే విమర్శలుచేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులుగా మిగిల్చిన వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టు అని, ఇది కాళేశ్వరం కంటే అతి పెద్ద ప్రాజెక్టుగా ఆయన కీర్తించారు. ప్రతి పక్షాలు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్ళీ అన్ని అడ్డంకులు కల్పించినప్పటికి, భూసేకరణ జరగకుండా అడ్డుపడినప్పటికి ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలతో, యుద్ధ్దప్రాతిపదికన ఈ ప్రాజెక్టును నిర్మించారని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో నోబెల్స్ , గోబెల్స్ మధ్యే పోటీ
రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి మధ్యే పోటీ అని, ఏలాంటి పనులు చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ మాటలు వింటారో లేక చెప్పిన వాటని చేసి చూపించిన బిఆర్‌ఎస్ మాటలు వింటారో ప్రజలో తెల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి గోబేల్స్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని ఎప్పటికైనా నోబెల్స్ గెలుస్తుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ నీ ప్రజలు కోరుకోరు అని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే బిఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు . కౌరవుల లాగా వంద అబద్ధాలు ఆడినా మీ పక్క జన బలం లేదని ప్రజలంతా బిఆర్‌ఎస్ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెం.1
ధాన్యం ఉత్పత్తిలోనే కాదు డాక్టర్ల ఉత్పత్తిలోనే దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నాడు కరువు పీడిత ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు పచ్చటి పంటలతో ధాన్యం ఉత్పత్తి చేస్తూ పంజాబ్, హర్యాన రాష్ట్రాలను తలదన్ని దేశానికే తెలంగాణ ధాన్యగారంగా మారిందన్నారు.లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు, హమాలీ కూలి బిడ్డ నేడు ఎంబిబిఎస్ చదవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇప్పుడు

ఒక సంవత్సరం ఎల్ కె జి ఫీజులతో ఐదేళ్ళపాటు ఎంబిబిఎస్ చదవచ్చన్నారు. ఐటీ , ఫార్మా రంగంలో, విద్య, వైద్యం, వ్యవసాయ,పంట, పాడి ఏ రంగం చూసినా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పాడి పంట, బడి మడి ,పారే కాలువులు ఏ రంగం అయినా చూడండి అన్నింట్లో తెలంగాణ నెంబర్ వన్ అని ఆయన అన్నారు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు అని, ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎందుకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
సీతారామా పూర్తి అయితే కరువు అనేది డిక్షనరీలో ఉండదు
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ పథకం పనులు చివరి దశలో ఉన్నాయని ఇక్కడి ప్రాంతం సస్య శ్యామలం కావాలంటే కేసీఆర్ ను దీవించాలని మంత్రి హారిశ్ రావు విజ్ణప్తి చేశారు. కృష్ణ నదిలో ప్రస్తుతం నీళ్ళు లేవని, అదే సీతారామా ప్రాజెక్టును నిర్మించుకుంటే కరువు అనే పదం డిక్షనరీలో ఉండబోదన్నారు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల టిఎం సిల నీరు సముద్రంలో వ్రదాగా కలిశాయన్నారు. సీతారామా ప్రాజెక్టు టన్నెల్ పనులు చివరి దశలోకి వచ్చాయని ఏడాదిలోగా పాలేరుకు గోదావరి నీటిని అనుసంధానం చేసి తీరుతామన్నారు. ఖమ్మం జిల్లా పై ప్రత్యేక ప్రేమ ఉందని, నాడు ఉద్యమ సమయంలో కెసిఆర్ జైల్ కు వెళ్ళినప్పుడు,దీక్ష మయంలో ఈ జిల్లా ప్రజలు గుండెకు హత్తుకున్నారని,.

అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం పట్టుదలతో ఉన్నారని రానున్న రెండు,మూడు నెలల్లో కొంత వరకు,ఏడాది తరువాత పూర్తిగా జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. అందుకే జిల్లా ప్రజల దివేనలు,ఆదరణ కెసిఆర్ పై ఉండలన్నారు. ఈవిలేఖర్ల సమావేశంలో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు ఎంపిలు నామ నాగేశ్వర్ రావు,వద్దిరాజురవిచంద్ర,డా బండి పార్దసారధి రెడ్డి,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,తాతా మధు,ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు,బానోతు హరిప్రియ,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News