Friday, November 15, 2024

తెలంగాణను చూసి కేంద్రం ఓర్వడం లేదు : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

 

Harish Rao

మెదక్: 70 ఏళ్లలో బిజెపి, కాంగ్రెస్ చేయలేనిది 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  మెదక్ జిల్లా మనోహరబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘గీతారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు . కెసిఆర్ వచ్చాక తాగు, సాగు నీళ్ల కొరత లేదు, కరెంట్ కొరత లేదు. కాంగ్రెస్, బిజెపి వాళ్లు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్లల్లో రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారు?  ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ వచ్చి రాష్ట్రం గురించి ఒక్క మాట అయినా చెప్పారా,  రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా?’అని నిలదీశారు.

తెలంగాణను చూసి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు  అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం,  రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మాట అయినా చెప్పలేదు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు.  తెలంగాణ అభివృద్ధి కోసం తాము మాత్రమే పాటు పడతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News