Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డి సవాలుపై హరీశ్ రావు స్పందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా సజావుగా జరిగితే తాను తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానని బిఆర్ఎస్ ఎంఎల్ఏ హరీశ్ రావు అన్నారు. తనకు పదవులు ముఖ్యం కావని రైతులకు , పేదలకు, అణగారిన వర్గాల వారికి మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లు రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని హరీశ్ రావు అన్నారు.

సోషల్ మీడియా ద్వారా హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ‘‘ మరోసారి చెబుతున్నా ఆగస్టు 15 లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 2 లక్షల రుణ మాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు(అందులోని 13 హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా?’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు మరోసారి సవాలు విసిరారు.

‘‘ తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా పారిపోయావు, ఆ తర్వాత కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. వెన్నుచూపి పారిపోయింది నువ్వే’’ అంటూ హరీశ్ రావు సోషల్ మీడియాలో రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News