Saturday, December 28, 2024

నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన జరిగిన విషయం తెలియగానే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు హరీష్ రావుకు వివరించారు.
గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, బాగా చూసుకోవాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై కాలేజీ విద్యార్థుల బస్సును వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 15 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News