Monday, December 23, 2024

కాలువలో పడిన కారు స్పందించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

జగదేవ్ పూర్: సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడప వద్ద జరిగిన ప్రమాద సంఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. దురదృష్టవశాత్తు కారు కాలువలో పడి ఐదుగురు మృతి చెందిన సంఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే సిద్దిపేట కలెక్టర్ , జిల్లా పోలీసు కమిషనర్ ను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే పోస్టు మార్టమ్ పూర్తి చేసి మృతదేహాలను యాద్రాద్రి జిల్లా బిబి నగర్ మండలం బొమ్మలరామారానికి తరలిస్తామని చెప్పారు. సంఘటనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను హైదరాబాద్ కు తరలించగా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News