Wednesday, January 22, 2025

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం: హరీష్‌ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం. పాపం ఈ వయస్సులో ఆయన అరెస్ట్ మంచిది కాదు. గతంలో ఐటీ, ఐటీ అన్నాడు.. కానీ, ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారు” అని పేర్కొన్నారు.

కాగా, ఎపిలో స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అరెస్టుపై పలువురు ముఖ్య నాయకులు స్పందిస్తూ, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పలవురు బిఆర్ఎస్ నాయకులు కూడా ఆయన అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపారు. అయితే, ఇటీవల చంద్రబాబు అరెస్టుపై కెటిఆర్ స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు. ఆంద్రలో పంచాయతీ.. ఆంధ్రలోనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News