Wednesday, January 22, 2025

ఇదిగో.. చూడండి ఆసుపత్రి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

కళ్లున్న కబోదికి అభివృద్ధి
కనిపించదు నడ్డా
ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా
హరీశ్‌రావు కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో జెపి నడ్డా వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు కౌంటరిచ్చారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్‌సిటీగా మార్చాలని సిఎం కెసిఆర్ సంకల్పించారని, 24 అంతస్తుల్లో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని, వెను వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి శరవేగంగా పనులు ప్రారంభించిందన్నారు. మూడు నెలల్లోనే 15 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కండ్లుండీ చూడలేని వారికి ఈ అభివృద్ధి కనిపించదన్నారు. నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసేవారికి ఈ హాస్పిటల్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావని తెలిపారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి మాత్రమే కాదు, ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మించబడుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News